తూర్పు గోదావరి జిల్లాలో అన్ని ప్రైవేటు వైద్యశాలల్లోనూ తప్పనిసరిగా కొవిడ్ వైద్య సేవలు అందించాలని సూచించారు కలెక్టర్ మురళీధర్‌రెడ్డి. ఇప్పటి వరకూ లక్ష 12వేల 431 కరోనా పరీక్షలు నిర్వహించగా 2,147 పాజిటివ్ కేసులు నమోదయ్యాయని చెప్పారు. జిల్లాలో ప్రస్తుతం 7,617 పడకలు అందుబాటులో ఉన్నాయని, మరో 2వేల పడకలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.
జిల్లాలోని IMA సభ్యులతో పాటుగా ప్రైవేటు నర్సింగ్ అసోసియేషన్ తదితరులతోనూ సమావేశమైనట్లు చెప్పారు. కాకినాడ లోని జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కరోనా విధులు నిర్వహిస్తున్న ప్రభుత్వ, ప్రైవేటు వైద్యులను కలెక్టర్‌తో పాటు ఎస్పీ నయీంఅస్మీ, జేసీలు లక్ష్మీషా, రాజకుమారి, కీర్తి సన్మానించారు.