తూర్పుగోదావరి పి.గన్నవరం నియోజకవర్గం పరిధిలోని అయినవిల్లి మండలంలో కరోనా కేసుల సంఖ్య పెరుగుతున్న వేళ... చుట్టుపక్కల గ్రామాలలో ప్రజలు కరోనా నిర్ధరణ పరీక్షలు చేయించుకుంటున్నారు. ఈ నెల 23న వివిధ గ్రామాలకు చెందిన 145 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేశారు. ఈ ఫలితాలు శనివారం వెలువడ్డాయని అయినవిల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారిణి మంగాదేవి తెలిపారు. ఇందులో 138 మందికి నెగెటివ్ రాగా, ఏడుగురికి పాజిటివ్ వచ్చినట్టు ఆమె వెల్లడించారు. ఈ మండలంలో ఇప్పటికే 42 పాజిటివ్ కేసులు నమోదైయ్యాయి. వీరిలో కొందరు చికిత్స పొందుతున్నారు.
అయినవిల్లి: కరోనా పరీక్షల్లో ఎక్కువ మందికి నెగెటివ్ ఫలితాలు - పి గన్నవరం న్యూస్
తూర్పుగోదావరి జిల్లా అయినవిల్లి మండలంలో కరోనా కేసులు పెరుగుతున్న క్రమంలో... కొత్తగా వెలువడిన ఫలితాలు ఆశ్చర్యం కలిగించాయి. చుట్టు పక్కల గ్రామాల్లో కరోనా పరీక్షలు చేయించుకున్న 138 మందికి నెగెటివ్, ఏడుగురికి పాజిటివ్ నిర్ధరణ అయినట్టు వైద్యులు తెలిపారు.
![అయినవిల్లి: కరోనా పరీక్షల్లో ఎక్కువ మందికి నెగెటివ్ ఫలితాలు east godavari district](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7795575-305-7795575-1593261304348.jpg)
పి గన్నవరంలో అందరికీ నెగటివ్ ఫలితాలు
Last Updated : Jun 28, 2020, 8:55 AM IST