తూర్పు గోదావరి జిల్లాలో ఆలమూరు మండలంలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. పెనికేరులోని ఇద్దరికి, నందిపూడి ఓ మహిళకు కరోనా సోకినట్టు.. పెద్దపళ్ల పీహెచ్సీ వైద్యాధికారి సుదర్శన్ బాబు తెలిపారు.
మండలంలో ప్రస్తుతం కరోనా కేసుల సంఖ్య 26కి చేరిందని చెప్పారు. కేసులు పెరుగుతున్న దృష్ట్యా అధికారులు అప్రమత్తమై గ్రామాల్లో ప్రత్యేక పారిశుద్ధ్య పనులు చేపట్టారు. ప్రభావిత ప్రాంతాల్లో కంటైన్ మెంట్ జోన్లు ఏర్పాటు చేస్తున్నారు.