పేకాడుతూ పట్టుబడిన ముగ్గురు వ్యక్తులకు తూర్పుగోదావరి జిల్లా ఆలమూరు కోర్టు జైలు శిక్ష విధించినట్లు ఎస్సై శివ ప్రసాద్ తెలిపారు. ఆలమూరు మండలం చొప్పెల్ల శివారు ప్రాంతాల్లో డిసెంబర్ 17, 2020 రోజున పేకాట ఆడుతున్న ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకుని వారి వద్ద నుంచి 48,400 నగదును స్వాధీనం చేసుకున్నారు. వారిపై ఆలమూరు పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసు మంగళవారం విచారణకు రాగా.. ఒక్కొక్కరికి మూడు రోజులు జైలు శిక్ష విధిస్తూ జడ్జి అమరరంగేశ్వర రావు తీర్పునిచ్చినట్లు ఎస్సై శివ ప్రసాద్ అన్నారు.
పేకాటాడుతూ పట్టుబడిన ముగ్గురు వ్యక్తులకు జైలుశిక్ష - ఆలమూరు వార్తలు
పేకాటాడుతూ గతేడాది డిసెంబర్లో పట్టుబడిన ముగ్గురు వ్యక్తులకు ఆలమూరు కోర్టు మూడు రోజుల జైలు శిక్ష విధించింది. ఈ కేసు మంగళవారం విచారణకు రాగా కోర్టు తీర్పు నిచ్చింది.
పేకాటాడుతూ పట్టుబడిన ముగ్గురు వ్యక్తులకు జైలుశిక్ష