ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ముద్రగడ తన నిర్ణయాన్ని మార్చుకోవాలి: రాష్ట్ర కాపు ఐకాస - కాపుల రిజర్వేషన్ పై వార్తలు

ముద్రగడ తన నిర్ణయంపై పునరాలోచించుకోవాలని రాష్ట్ర కాపు ఐకాస కన్వీనర్‌ ఆకుల రామకృష్ణ అన్నారు. ఉద్యమం నుంచి తప్పుకోవడం సరైన ఆలోచన కాదన్నారు. ఉద్యమం కీలక దశకు చేరిందని ఆకుల రామకృష్ణ అన్నారు.

akula rama krishna on mudhra gada step back in kapu movement
రాష్ట్ర కాపు ఐకాస క న్వీనర్ ఆకుల రామకృష్ణ

By

Published : Jul 15, 2020, 7:34 PM IST

మాజీ మాంత్రి, కాపు రిజర్వేషన్ ఉద్యమ నాయకుడు ముద్రగడ పద్మనాభం తన నిర్ణయాన్ని మార్చుకోవాలని రాష్ట్ర కాపు ఐకాస కన్వీనర్‌ ఆకుల రామకృష్ణ కోరారు. తూర్పుగోదావరి జిల్లా రావులపాలెం మండలం గోపాలపురంలోని ఆయన ఇంటి వద్ద కాపు సంఘ నాయకులతో సమావేశమయ్యారు.

ఈ ఉద్యమం కీలక దశకు చేరిందని ఆకుల రామకృష్ణ అన్నారు. ఈ సమయంలో ఉద్యమ బాధ్యతల నుంచి తప్పుకోరాదని ముద్రగడను కోరారు. ప్రభుత్వం 13నెలలు అయినందున తమ హక్కులను గుర్తు చేయవలసిన బాధ్యత మనపై ఉందన్నారు. ఈ సంవత్సర కాలంలో ఉద్యోగాల విషయంలో గాని నిధుల విషయంలో గాని చాలా నష్టపోయమన్నారు. చిత్తశుద్ధి గల ప్రభుత్వాలు ఉంటే సానుకూలంగా కాపు రిజర్వేషన్ సమస్య పరిష్కారం అవుతుందన్నారు. ముద్రగడ తమ నిర్ణయాన్ని పునరాలోచించాలన్నారు.

ABOUT THE AUTHOR

...view details