తూర్పుగోదావరి జిల్లా పి. గన్నవరం నియోజకవర్గం అయినవిల్లిలో ప్రముఖ పుణ్యక్షేతమైన సిద్ధి వినాయకుని ఆలయంలో స్వామి వారి దర్శనం పునః ప్రారంభమైంది. కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా నాలుగు నెలల నుంచి భక్తుల ప్రవేశాన్ని నిలిపివేశారు. తిరిగి శనివారం ఉదయం నుంచి దర్శించుకునే అవకాశం కల్పించారు. ఆలయానికి వచ్చే భక్తులు కొవిడ్ నిబంధనలు కచ్చితంగా పాటించేలా చూస్తున్నామని ఆలయ ఈవో పి. తారకేశ్వర రావు వెల్లడించారు. పరిమిత సంఖ్యలో భక్తులు స్వామి వారిని దర్శించుకుని తీర్ధప్రసాదాలు స్వీకరించారు.
అయినవిల్లి సిద్ధి వినాయకుని దర్శనం పునః ప్రారంభం - ainvalli ganesh temple latest news
నాలుగు నెలల అనంతరం తిరిగి అయినవిల్లిలో సిద్ధి వినాయకుడు భక్తులకు దర్శనమిచ్చాడు. ఆలయానికి వచ్చే భక్తులు కొవిడ్ నిబంధనలు కచ్చితంగా పాటించాలని ఆలయ ఈవో తెలిపారు. శనివారం స్వామి వారి దర్శనానికి పరిమిత సంఖ్యలో భక్తులను అనుమతించారు.
![అయినవిల్లి సిద్ధి వినాయకుని దర్శనం పునః ప్రారంభం aienavalli sidhi vinayaka darshan stated for devotees at east godavari district](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8342244-871-8342244-1596878941402.jpg)
అయినవిల్లి సిద్ధి వినాయకుని దర్శనానికి క్యూలైన్లో వేచి ఉన్న భక్తులు