గ్రామాల్లో పారిశుద్ధ్య పనులు అధ్వానంగా ఉండడం వల్ల ప్రజలు వ్యాధుల బారిన పడుతున్నారని వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు పేర్కొన్నారు. తూర్పు గోదావరి జిల్లా కాకినాడ గ్రామీణంలోని రమణయ్యపేట పంచాయతీ పరిధిలోని పలుప్రాంతాల్లో ఆదివారం ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ‘గ్రామాల్లో పందులు విచ్చలవిడిగా తిరగడం వల్ల అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి. పెంపకందార్లతో సమావేశం నిర్వహించి శివారు ప్రాంతాలకు తరలించాలి. మాట వినకుండా అదే పరిస్థితి కొనసాగిస్తే పందులు కనిపిస్తే కాల్చివేతకు ఆదేశాలిస్తాం’ అని హెచ్చరించారు. వాటి పెంపకందార్లు ముందుకొస్తే ప్రత్యామ్నాయ ఉపాధి అవకాశాలు కల్పిస్తామన్నారు.
kanna babu: 'పందులను తరలించకుంటే.. కాల్చివేతకు ఆదేశిస్తాం'
గ్రామాల్లో పందులు విచ్చలవిడిగా తిరగడం వల్ల అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయని వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు అన్నారు. వాటి నియంత్రణపై పందుల పెంపకందారులతో సమావేశం నిర్వహించారు.
మంత్రి కురసాల కన్నబాబు