తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం మండలంలోని వడ్లమూరుకు చెందిన కంటే రామకృష్ణ అనే రైతు నిర్లక్ష్యం రెండు పాడి గేదెల మృతికి కారణం అయ్యింది. తన పొలం వద్ద దోమల కోసం పెట్టిన పొగ ఆర్పకపోవడం వల్ల మంటలు చెలరేగి పశువుల పాక దగ్ధం అయ్యింది. పశువుల పాకలో ఉన్న మూడు పాడి గేదెలలో ఒకటి గాయాలతో బయటపడగా రెండు గేదెలు మృతి చెందాయి. రైతుకు చెందిన ద్విచక్ర వాహనంతో పాటు ఐదు ఎకరాల గడ్డి వాము కూడా దగ్ధం అయ్యింది.. దాదాపు మూడు లక్షల వరకు ఆస్తి నష్టం సంభవించిందని బాధిత రైతు విలపించాడు.
పశువుల పాక దగ్ధం..రెండు పాడి గేదెలు మృతి
తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం నియోజకవర్గంలోని వడ్లమూరులో పశువుల పాక దగ్ధం అయ్యింది. కంటే రామకృష్ణ అనే రైతు తన పొలం వద్ద దోమల కోసం పెట్టిన పొగ ఆర్పకపోవడం వల్ల మంటలు చెలరేగి పాకకు అంటుకున్నాయి. ఈ ఘటనలో రెండు పాడి గేదెలు మృతి చెందాయి.
పశువుల పాక దగ్ధం