ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'ఆ చెత్త మా కెందుకు'- ముమ్మిడివరం ప్రజల ధర్నా! - తూర్పుగోదావరి జిల్లా

డంపింగ్ యార్డ్ తొలగించాలంటూ తూర్పుగోదావరి జిల్లా ముమ్మిడివరం నగర పంచాయతీ పరిధిలో ఉన్న గ్రామప్రజలు ఆందోళనకు దిగారు.

గ్రామస్తుల ఆందోళన

By

Published : Sep 26, 2019, 4:42 PM IST

గ్రామస్తుల ఆందోళన
డంపింగ్ యార్డ్​ తొలగించాలంటూ తూర్పుగోదావరి జిల్లా ముమ్మిడివరం నగర పంచాయతీ కార్యాలయం వద్ద ప్రజలు ఆందోళనకు దిగారు. ముమ్మిడివరం నగర పంచాయతీ పరిధిలో ఉన్న 13 గ్రామాలకు ప్రధాన రహాదారి పక్కనే 15 ఏళ్లుగా డంపింగ్ యార్డ్​ను నిర్వహిస్తున్నారు. యార్డ్​ను నిర్వహిస్తున్న అధికారులు, సిబ్బంది నిర్లక్ష్యంతో చెత్తను రహదారిపైనే వేస్తుండటంతో ఆ ప్రాంతం ప్రమాదకరంగా మారింది. దీంతో 13 గ్రామాల ప్రజలు నగర పంచాయతీ కార్యాలయం వద్ద ఆందోళకు దిగారు. డంపింగ్ యార్డ్​ను తక్షణమే తొలగించాలంటూ డిమాండ్ చేశారు. చెత్తను ప్రమాదకరంగా ఉంచేయటంతో అంటు వ్యాధులు ప్రబలే అవకాశం ఉందని వారు ఆవేదన వ్యక్తం చేశారు.

ABOUT THE AUTHOR

...view details