గండేపల్లి మండలం మల్లేపల్లి సంత మార్కెట్ సమీపంలో నివసిస్తున్న వృద్ధురాలు అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. మృతురాలిని పైడితల్లి అని గ్రామస్థులు గుర్తించారు.
ఆమె మరణించిన తీరుపై గ్రామస్తులు అనుమానం వ్యక్తం చేశారు. కొద్ది కాలంగా ఆమె ఒంటరిగా ఉంటోందని తెలిపారు. గండేపల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు సీఐ సురేష్ బాబు తెలిపారు.