ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'నష్టపోయిన రైతులను ఆదుకోవాలి' - తూర్పుగోదావరి జిల్లా వార్తలు

తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం నియోజకవర్గంలో ఏలేరు నది వరదల ధాటికి నష్టపోయిన రైతులను ఆదుకోవాలని...మాజీ ఎమ్మెల్యే వర్మ...కలెక్టర్ మురళిధర్​రెడ్డికి వినతిపత్రం అందించారు.

affected farmers should be supported at eastgodavari district
నష్టపోయిన రైతులను ఆదుకోవాలి

By

Published : Dec 1, 2020, 8:05 AM IST

ఏలేరు నది వరదలతో పిఠాపురం నియోజకవర్గంలో నష్టపోయిన రైతులను ఆదుకోవాలని మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్ఎన్ వర్మ...కలెక్టర్‌ డి.మురళీధర్‌రెడ్డికి వినతిపత్రం అందజేశారు. ఏలేరు వరద నీటిని 25వేల క్యూసెక్కులు విడుదల చేయటం వల్ల పంటలు మునిగిపోయాయని అన్నారు. ఏకరానికి రూ.25వేల చొప్పున పంట నష్టం ఇవ్వాలన్నారు. పిఠాపురంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు నామమాత్రంగా ఉన్నాయని...కమిషన్ల రూపంలో మిల్లులకు ధాన్యం తరలిస్తున్నారని అన్నారు. రైతులను ఆదుకోవాలంటూ..డిమాండ్ చేశారు.

ఇదీ చదవండి:

మళ్లీ కేంద్ర జలసంఘం పరిశీలనకు పోలవరం ఖర్చు

ABOUT THE AUTHOR

...view details