ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కరోనాతో సినీగేయ రచయిత అదృష్ట దీపక్‌ మృతి - Adrustha Deepak dies after effected by covid

ప్రముఖ నాటక, సినీ గేయ రచయిత అదృష్ట దీపక్.. కొవిడ్​ చికిత్స పొందుతూ కాకినాడలో తుదిశ్వాస విడిచారు.

writer Adarsh ​​Deepak dies
సినీ గేయ రచయిత అదృష్ట దీపక్ మృతి

By

Published : May 17, 2021, 3:51 AM IST

సినీగేయ రచయిత అదృష్ట దీపక్‌ కరోనాకు బలయ్యారు. కాకినాడలో కొవిడ్‌తో పోరాడుతూ తుదిశ్వాస విడిచారు. తూర్పుగోదావరి జిల్లా రాయవరం మండలం సోమేశ్వరంలో పుట్టిన దీపక్‌.. హేతువాదిగా, నాటక రచయితగా గుర్తింపు పొందారు. సవరించు కోకిలమ్మ పదాలు, అగ్ని, సమరశంఖం, ప్రాణం, అడవి తదితర రచనలు చేశారు.

ఆకాశవాణి, దూరదర్శన్‌.. ఆయన కథలూ, కవితలు ప్రసారం చేశాయి. 1980లో 'యువతరం కదిలింది' చిత్రంతో సినీగేయ రచయితగా మారారు. అనంతరం విప్లవ శంఖం, నవోదయం, నేటిభారతం, ఎర్రమందారం, మా ఆయన బంగారం, వందేమాతరం వంటి చిత్రాలకు పాటలు చేశారు. నేటి భారతం చిత్రంలోని మానవత్వం పరిమళించే మంచి మనిషికి స్వాగతం గేయం అదృష్ట దీపక్ కలం నుంచే జాలువారింది.

ఇదీ చదవండి…పెనాల్టీ పడకుండా ఎఫ్​డీ నుంచి ముందుగా నగదు విత్​డ్రా!

ABOUT THE AUTHOR

...view details