ప్రజలతో స్నేహపూర్వకంగా మెలుగుతూ అవినీతిరహిత పాలన అందిస్తానని తూర్పు గోదావరి జిల్లా ఎస్పీ నయీం అడ్నాన్ అస్మీ అన్నారు. కాకినాడలోని ఎస్పీ కార్యాలయంలో ఆయన కొత్తగా బాధ్యతలు స్వీకరించారు. జిల్లా పోలీసు ఉన్నతాధికారులు పుష్పగుచ్చాలు ఇచ్చి శుభాకాంక్షలు తెలిపారు. రౌడీయిజం, సమాజ వ్యతిరేక శక్తులపై కఠినంగా వ్యవహరిస్తామని ఎస్పీ హామీ ఇచ్చారు. శాంతిభద్రతల పరిరక్షణపై ప్రత్యేక దృష్టి సారిస్తామన్నారు. పోలీసులకు వారాంతపు సెలవుపై ఇప్పటికే ప్రతిపాదనలు వెళ్లాయని....మరికొన్ని రోజుల్లో ఈ అంశంపై స్పష్టత వస్తుందని ఎస్పీ అడ్నాన్ అస్మీ చెప్పారు.
తూర్పుగోదావరి జిల్లా కొత్త ఎస్పీ బాధ్యతల స్వీకరణ - new
తూర్పు గోదావరి ఎస్పీగా అడ్నాన్ అస్మీ బాధ్యతలు స్వీకరించారు. రౌడీయిజం, సమాజ వ్యతిరేక శక్తులపై కఠినంగా వ్యవహరిస్తామన్నారు.
తూర్పు గోదావరి ఎస్పీగా అడ్నాన్ అస్మీ