ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Jan 25, 2020, 4:55 PM IST

ETV Bharat / state

భావి తరాల కోసం మంచి సమాజాన్ని నిర్మించండి: గవర్నర్

సమాజానికి, ప్రజలకు సేవ చేసేందుకు ప్రతి విద్యార్థీ కనీసం ఐదు మెుక్కలు నాటాలని రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ అన్నారు. ప్రపంచంలోనే అతి పెద్ద గొప్ప ప్రజాస్వామ్యంలో ఉన్నందుకు గర్వపడాలన్నారు. నన్నయ విశ్వవిద్యాలయంలో 11, 12 స్నాతకోత్సవానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

governor biswabhusan harichandan
నన్నయ విశ్వవిద్యాలయం స్నాతకోత్సవం

నన్నయ విశ్వవిద్యాలయం స్నాతకోత్సవం

సమాజ అభివృద్ధికి యువత పాత్ర చాలా ముఖ్యమైనదని గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ అన్నారు. తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయం ప్రాంగణంలో నిర్వహించిన స్నాతకోత్సవ కార్యక్రమంలో గవర్నర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. వినయ విధేయతలు ప్రతి ఒక్కరికీ చాలా అవసరమని...సమాజానికి మనం ఏం చేయగలమో ప్రతి ఒక్కరూ ప్రశ్నించుకోవాలని ఆయన అన్నారు. రాజ్యాంగంలో ప్రాథమిక హక్కులు, ప్రాథమిక సూత్రాలు ఉన్నాయని వాటిని తప్పనిసరిగా పాటించాలన్నారు. సమానత్వ సూత్రాన్ని పాటిస్తూ ముందుకు సాగాలన్నారు. ఈ కార్యక్రమానికి మరో ముఖ్య అతిథిగా రాజీవ్ గాంధీ విశ్వవిద్యాలయం ఆఫ్ నాలెడ్జ్​ టెక్నాలజిస్​ ఛాన్సలర్ ఆచార్య కె.సి. రెడ్డి హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ... మాజీ ముఖ్యమంత్రి దివంగత వైయస్ రాజశేఖర్ రెడ్డి రాజమహేంద్రవరం ప్రాంతంలో విశ్వవిద్యాలయం ఏర్పాటు చేసేందుకు ఎంతో కృషి చేశారన్నారు. 11, 12 స్నాతకోత్సవం సందర్భంగా 567 మంది విద్యార్థులకు పట్టాలు, ఎనిమిది మందికి బంగారు పతకాలు, ఆరుగురికి పీహెచ్​డీలు గవర్నర్ చేతుల మీదుగా ప్రదానం చేశారు.

ABOUT THE AUTHOR

...view details