తూర్పుగోదావరి జిల్లా అనపర్తిలో ఎమ్మెల్యేపై సామాజిక మాధ్యమాల్లో పోస్టు పెట్టిన ఓ యువకుడ్ని పోలీసులు అరెస్టు చేశారు. ఆ యువకుడిని రెండురోజులుగా పోలీస్ స్టేషన్లో ఉంచిన విషయాన్ని తెలుసుకున్న అనపర్తి మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి స్టేషన్కు వెళ్లారు. ఎఫ్ఐఆర్ లేకుండా యువకుడ్ని స్టేషన్లో ఎందుకు ఉంచారంటూ పోలీసులను ప్రశ్నించారు. అదే సమయంలో అదనపు ఎస్సై మద్యం సేవించి విధి నిర్వహణలో ఉండడం గ్రహించి.. ఆయన స్టేషన్ బయట బైఠాయించి నిరసన చేపట్టారు. విషయం తెలుసుకొని ఠాణాకు వచ్చిన అనపర్తి సీఐ భాస్కరరావు అదనపు ఎస్సైపై చర్యలు తీసుకుంటానని హామీ ఇవ్వడంతో మాజీ ఎమ్మెల్యే నిరసన విరమించారు.
మద్యం సేవించి విధులు.. చర్యలకు ఉపక్రమించిన ఉన్నతాధికారులు - నల్లమిల్లి స్టేషన్ వార్తలుట
సామాజిక మాధ్యమాల్లో అనపర్తి ఎమ్మెల్యేపై పోస్టు పెట్టిన విషయమై ప్రశ్నించడానికి వెళ్లిన మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి.. స్టేషన్లో అదనపు ఎస్సై మద్యం మత్తులో ఉండడాన్ని గమనించి ఠాణా బయట బైఠాయించారు. ఆ అధికారిపై చర్యలు తీసుకుంటామని సీఐ హామీ ఇవ్వడంతో నిరసన విరమించారు.
మద్యం సేవించి అదనపు ఎస్సై విధులు.. చర్యలు తీసుకుంటామన్న సీఐ