"తూర్పుగోదావరి జిల్లా తుని పట్టణానికి చెందిన మహిళ ఒకరు మండుటెండలో విధి నిర్వహణలో ఉన్న పోలీసులకు రెండు పెద్ద బాటిల్స్‌తో శీతల పానీయాలను తెచ్చి అందించారు. ప్రజలందరూ తమ తమ ఇళ్లలో ఉంటే చాలు, తమకు ఇంకేమీ వద్దమ్మా అంటూ మొహమాటపడిన పోలీసులను... తీసుకోవాల్సిందిగా ఆ మహిళ మరీ మరీ కోరుతున్నారు. ఆ తరువాత తన వివరాలు అడిగిన పోలీసులకు తనో కూలీనని, తన ఆదాయం నెలకు మూడువేలని చెప్పింది. మమ్మల్ని కంటికి రెప్పలా కాచుకుంటున్న పోలీసుల గురించి ఏదైనా చేయాలనే ఉద్దేశంతో తాను ఇలాచేశానని ఆమె వివరించింది. ఆమె మాటలతో కదిలిపోయిన పోలీసులు ‘‘అమ్మా, మీకు వీలైతే మీ ముఖం రోజూ ఒకసారి మాకు చూపిస్తే మాకు ధైర్యంగా ఉంటుందన్న... ఆ దృశ్యం చూస్తుంటే మనసును కదిలిస్తోంది.’ మరి నేటి పరిస్థితులకు దర్పణం పట్టే ఈ వీడియోను మీరూ చూడండి" అని నటుడు ట్విట్టర్ ఆ వీడియోను పంచుకున్నారు.
ఈ అమ్మ మనసే గోదారి... ట్వీట్ చేసిన నటుడు మాధవన్ - పోలీసులకు డ్రింక్స్ ఇచ్చిన మహిళ వార్తలు
దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ను మే 3వరకు పొడిగించారు. ఈ నేపథ్యంలో పోలీసులు, వైద్య సిబ్బంది నిరంతర సవాళ్లతో కూడిన వాతావరణంలో విధులను నిర్వహిస్తున్నారు. ప్రాణాపాయం ఉందని తెలిసి కూడా వెనుకడుగు వేయని వీరిపై మానవత్వం మరచిన కొందరు దాడులకు తెగబడుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో పోలీసులకే ధైర్యాన్నిచ్చే సంఘటనకు సంబంధించిన ఓ వీడియోను ప్రముఖ నటుడు మాధవన్ తన ట్విటర్ ఖాతాలో పంచుకున్నారు.
ట్వీట్ చేసిన నటుడు మాధవన్