లైంగిక వేధింపులు ఎదుర్కొంటున్న... రాజమహేంద్రవరంలోని ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయం ఆంగ్ల విభాగాధిపతి సూర్య రాఘవేంద్రను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. విచారణ నిష్పక్షపాతంగా జరిగేందుకే ఆయన్ని విధుల నుంచి తొలగించినట్లు ఉపకులపతి సురేశ్ వర్మ తెలిపారు. సీఎంకు ముగ్గురు విద్యార్థినులు లేఖ రాయడంతో... లైంగిక వేధింపుల విషయం వెలుగులోకి వచ్చింది. విద్యార్థినుల ఆరోపణలపై ఆంధ్ర మహిళా ఆర్గనైజేషన్ సభ్యులు రిజిస్ట్రార్‌కు ఫిర్యాదు చేశారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు రాజానగరం పోలీసులు తెలిపారు. విద్యార్థులతో మాట్లాడిన ఆంధ్ర మహిళ ఆర్గనైజేషన్ బృంద సభ్యులు... ఆరోపణలు ఎదుర్కొంటున్న వర్శిటీ అధికారులను వేర్వేరుగా ప్రశ్నించారు. కొంతమంది మొదటి సంవత్సరం విద్యార్థులూ గత నెల 27న ఫిర్యాదు చేస్తే... వర్శిటీ అధికారులు చర్యలు తీసుకోలేదని నిజనిర్ధరణ కమిటీ సభ్యులు తెలిపారు.
నన్నయ యూనివర్శిటీ అసిస్టెంట్ ప్రొఫెసర్‌పై వీసీ చర్యలు - అసిస్టెంట్ ప్రొఫెసర్‌పై నన్నయ యూనివర్శిటీ వీసీ చర్యలు
లైంగిక వేదింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయానికి చెందిన అసిస్టెంట్ ప్రొఫెసర్‌పై వీసీ చర్యలు తీసుకున్నారు. విచారణ పూర్తయ్యే వరకు అతన్ని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
అసిస్టెంట్ ప్రొఫెసర్‌పై నన్నయ యూనివర్శిటీ వీసీ చర్యలు...