ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'ప్రజా వ్యతిరేకతను ఎదుర్కోలేక దాడులకు దిగుతున్నారు' - lokesh latest news

తూర్పుగోదావరి జిల్లాలో తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌పై వైకాపా శ్రేణుల దాడి యత్నాన్ని ఆ పార్టీ నేతలు ఖండించారు. ఇది ప్రజాస్వామ్యమా..? జ‌గ‌న్‌స్వామ్యమా..? అని ప్రశ్నించారు.

achennayudu and kala venkat rao fires on ycp over attacks on lokesh
తెదేపా నేతలు

By

Published : Mar 4, 2020, 11:57 AM IST

కుట్రపూరితంగానే లోకేశ్‌కు భద్రత తగ్గించి దాడులకు ఉసిగొలుపుతున్నారని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు కళా వెంకట్రావు ఆరోపించారు. లోకేశ్‌పై దాడికి యత్నించిన వారిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రజా వ్యతిరేకతను ఎదుర్కోలేక వైకాపా నేతలు దాడులకు దిగుతున్నారని ధ్వజమెత్తారు. వైకాపా రౌడీలు ఎంత రెచ్చిపోయినా వెనక్కి తగ్గేది లేదని కళావెంకట్రావు స్పష్టం చేశారు.

ఇది ప్రజాస్వామ్యమా..? జ‌గ‌న్‌స్వామ్యమా..?

విశాఖ‌లో చంద్రబాబుపై, తూర్పుగోదావరి జిల్లాలో లోకేశ్‌పై దాడికి యత్నించారని తెదేపా ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. లోకేశ్‌ను అడ్డుకున్నది వైకాపా కిరాయి మూక‌లేనని ఆరోపించారు. ఇది ప్రజాస్వామ్యమా..? జ‌గ‌న్‌స్వామ్యమా..? అని అచ్చెన్నాయుడు నిలదీశారు. తెదేపాను అడ్డుకోవాలంటే వైకాపా కిరాయి రౌడీల్ని తెచ్చుకోవాలని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఇదీ చదవండీ... ముఖ్యమంత్రి జగన్‌కు చంద్రబాబు బహిరంగ లేఖ

ABOUT THE AUTHOR

...view details