తూర్పుగోదావరి జిల్లా ఆలమూరు మండలం జొన్నాడ జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో లంక శ్రీనివాస్ (45) అనే వ్యక్తి మృతి చెందాడు. ఇతను రావులపాలెంలో వస్త్ర దుకాణం నిర్వహిస్తున్నాడు. శుక్రవారం రాత్రి దుకాణం మూసి ద్విచక్రవాహనంపై ఇంటికి వెళ్తున్న సమయంలో జొన్నాడ రోడ్డు దాటుతుండగా... రాజమహేంద్రవరం నుంచి వస్తున్న మరో ద్విచక్రవాహనం బలంగా ఢీకొంది. ఈ ప్రమాదంలో శ్రీనివాస్ అక్కడికక్కడే మృతి చెందాడు. మరో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతాగాత్రున్ని రాజమహేంద్రవరం ఆసుపత్రికి తరలించారు. ఘటనపై ఆలమూరు ఎస్సై శివప్రసాద్ కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
జొన్నాడ జాతీయ రహదారిపై ద్విచక్రవాహనాలు ఢీ.... ఒకరు మృతి - alamuru mandal latest accident news
జొన్నాడు జాతీయ రహదారిపై జరిగిన ద్విచక్రవాహనాల ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందగా... మరో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. మృతి చెందిన వ్యక్తి శ్రీనివాస్గా ఆలమూరు పోలీసులు గుర్తించారు. గాయపడిన మరో వ్యక్తిని రాజమహేంద్రవరం ఆసుపత్రికి తరలించారు.
రెండు బైక్లు ఢీ... ఒకరు మృతి