తూర్పు గోదావరి జిల్లా అన్నవరం దేవస్థానంలో ఓ గుత్తేదారు నుంచి లంచం తీసుకుంటూ సీనియర్ అసిస్టెంట్ సాయిబాబా అవినీతి నిరోధకశాఖ అధికారులకు చిక్కారు.దేవస్థానానికి సంబంధించి ఓ పనికోసం గుత్తేదారుకు డిపాజిట్ సొమ్ము40వేలు తిరిగి ఇవ్వటానికి5వేలు లంచం డిమాండ్ చేశారు.డబ్బులు ఇవ్వటం ఇష్టంలేని గుత్తేదారు ఏసీబీ అధికారులకు ఉప్పందించారు.పథకం ప్రకారం సాయిబాబా డబ్బులు తీసుకుంటుండగా అధికారులు వల పన్ని పట్టుకున్నారు.ఉద్యోగిని అదుపులోకి తీసుకున్నట్లు ఏసీబీ డీఎస్పీ రామచంద్రరావు తెలిపారు.
ఏసిబి వలలో అన్నవరం సీనియర్ అసిస్టెంట్ - kakinada
అన్నవరం దేవస్థానంలో సీనియర్ అసిస్టెంట్ గుత్తేదారు నుంచి లంచం తీసుకుంటుండగా అవినీతి నిరోధకశాఖ అధికారులకు పట్టుబడ్డాడు.
అన్నవరం