ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఆలమూరు విద్యుత్ ఉపకేంద్రంలో అనిశా తనిఖీలు - అనిశా అధికారులు తనిఖీ

వినియోగదారుల నుంచి వచ్చిన ఫిర్యాదులతో తూర్పుగోదావరి జిల్లా ఆలమూరులోని విద్యుత్ ఉపకేంద్రంలో ఏసీబీ అధికారులు తనిఖీలు చేపట్టారు. వ్యవసాయ మోటార్లకు విద్యుత్ కనెక్షన్ ఇచ్చే సమయంలో ఇబ్బందులకు గురి చేస్తూ అక్రమాలకు పాల్పడినట్లు సమాచారం రావడంతో రికార్డులు పరిశీలించామని చెప్పారు.

acb raids in alamuru sub station
ఆలమూరు విద్యుత్ ఉపకేంద్రం

By

Published : Feb 25, 2021, 6:26 PM IST

తూర్పుగోదావరి జిల్లా ఆలమూరులోని విద్యుత్ ఉపకేంద్ర కార్యాలయంలో అనిశా అధికారులు తనిఖీలు నిర్వహించారు. రాజమహేంద్రవరం ఏసీబీ డీఎస్పీ రామచంద్రరావు ఆధ్వర్యంలో సిబ్బంది కార్యాలయంలోని రికార్డులను తనిఖీ చేశారు. వినియోగదారులు నుంచి వచ్చిన ఫిర్యాదులు, తమకు అందిన సమాచారం మేరకు విద్యుత్ కార్యాలయంలో తనిఖీలు చేపట్టినట్లు తెలిపారు.

ప్రజలకు సకాలంలో సేవలు అందించకుండా కాలయాపన చేయడంతోపాటు వారి వద్ద డబ్బులు డిమాండ్ చేస్తున్నట్లు తమ దృష్టికి వచ్చినట్లు చెప్పారు. వ్యవసాయ మోటార్లకు విద్యుత్ కనెక్షన్ ఇచ్చే సమయంలో ఇబ్బందులకు గురిచేస్తూ అక్రమాలకు పాల్పడినట్లు సమాచారం రావడంతో రికార్డులు పరిశీలించామని.. వినియోగదారుల నుంచి డబ్బులు డిమాండ్ చేస్తే చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.

ABOUT THE AUTHOR

...view details