ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ACB Raids: పంచాయతీ కార్యాలయాల్లో ఏసీబీ సోదాలు

తూర్పుగోదావరి జిల్లాలో ఏసీబీ అధికారులు సోదాలు చేపట్టారు. ఇన్​ఛార్జ్ పంచాయతీ కార్యదర్శిగా పని చేస్తున్న నిమ్మకాయల వెంకట సూర్యనారాయణ ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారనే ఆరోపణల నేపథ్యంలో అధికారులు సోదాలు చేపట్టారు.

acb raids
ఏసీబీ అధికారుల సోదాలు

By

Published : Aug 11, 2021, 12:58 PM IST

Updated : Aug 11, 2021, 3:10 PM IST

తూర్పుగోదావరి జిల్లా పి.గన్నవరంలో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. గన్నవరం మండలంలోని మానేపల్లి, వాడ్రేవుపల్లి గ్రామ పంచాయతీల్లో ఇన్​ఛార్జ్ పంచాయతీ కార్యదర్శిగా నిమ్మకాయల వెంకట సూర్యనారాయణ పని చేస్తున్నారు. ఆయన ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారనే అభియోగంపై ఏసీబీ అధికారులు సోదాలు చేస్తున్నారు. రెండు గ్రామ పంచాయతీ కార్యాలయాల్లో రికార్డులు పరిశీలిస్తున్నారు. అలాగే రాజోలు మండలం తాటిపాకలోని ఆయన నివాస గృహంలో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు.

పంచాయతీ కార్యాలయాల్లో ఏసీబీ అధికారుల సోదాలు

భారీ మొత్తంలో వెండి, బంగారు ఆభరణాలు సోదాల్లో బయటపడుతున్నట్లు సమాచారం. సూర్యనారాయణ గతంలో రాజోలు మండలం కడలి, పొన్నామండ, కాట్రేనిపాడు, తాటిపాకలో పంచాయితీ కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహించారు.


ఇదీ చదవండి:సాగునీరు ఇవ్వకపోతే.. చావే దిక్కు

Last Updated : Aug 11, 2021, 3:10 PM IST

ABOUT THE AUTHOR

...view details