తూర్పుగోదావరి జిల్లాలో కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. యానాం సమీప ప్రాంతాలలో వ్యాధి సోకిన వారు ఉండటంతో అధికారులు ఆంక్షలు కఠినతరం చేశారు. మద్యం ధరలు తక్కువగా ఉండే పుదుచ్చేరి రాష్ట్రంలో... ఇతర జిల్లాలు, రాష్ట్రాల వారు కొనుగోలుకు వీలులేకుండా ఆధార్ అనుసంధానంతో అమ్మకాలు సాగించేలా అధికార యంత్రాంగం చర్యలు చేపడుతుంది. దీనికి సంబంధించి ప్రజా పంపిణీ వ్యవస్థ అధికారుల వద్ద ఉన్న డేటాను మద్యం షాపులకు అనుసంధానం చేస్తున్నారు. వారం పది రోజుల్లో ఈ ప్రక్రియ అంతా పూర్తి అయిన తర్వాత మాత్రమే... ఇక్కడ మద్యం అమ్మకాలు ప్రారంభమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.
ఇతర జిల్లాలు, రాష్ట్రాల నుంచి వచ్చేవారికి మద్యం అమ్మరు - తూర్పుగోదావరిలో మద్యం అమ్మకాలు వార్తలు
తూర్పుగోదావరి జిల్లాలో కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్నందున... అధికారులు మరింత కఠినంగా వ్యవహరిస్తున్నారు. మద్యం ధరలు తక్కువగా ఉండే పుదుచ్చేరి రాష్ట్రంలో ఇతర జిల్లాలు, రాష్ట్రాల వారు కొనుగోలుకు వీలులేకుండా ఆధార్‌తో అనుసంధానం చేసి అమ్మకాలు చేయటానికి అధికారులు చర్యలు చేపడుతున్నారు.
ఇతర జిల్లాలు, రాష్ట్రాల నుంచి వచ్చే వారికి మద్యం ఇవ్వరు