ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

సైకిల్​పై 18 వేల కిలోమీటర్లు.... గిన్నిస్ రికార్డుకు చేరువలో తెలుగమ్మాయి!

ఆసేతు హిమాచలం సైకిల్​పై చుట్టేసి గిన్నిస్ సరికొత్త గిన్నిస్ వరల్డ్ రికార్డు నెలకొల్పేందుకు తూర్పుగోదావరి జిల్లాకు చెందిన ఓ యువతి ప్రయత్నిస్తోంది. ఇప్పటికే 18,200 కిలోమీటర్లు సైకిల్​పై ప్రయాణించింది. భారతదేశంలో రోడ్ల మీద మహిళల భద్రతకు ఎలాంటి ఇబ్బందులు లేవన్న సందేశాన్ని ఇవ్వడానికి తాను యాత్ర చేపడుతున్నట్లు ఆమె తెలిపారు.

cyclist
cyclist

By

Published : Oct 11, 2020, 6:36 PM IST

Updated : Oct 11, 2020, 6:50 PM IST

సైకిల్​పై 18వేల కిలోమీటర్లు యాత్ర.... గిన్నిస్ రికార్డుకు చేరువలో తెలుగమ్మాయి!

కన్యాకుమారి నుంచి కశ్మీర్‌లోని లేహ్ వరకూ సైకిల్​పై ప్రయాణించి గిన్నిస్ రికార్డు అధిగమించేందుకు తూర్పుగోదావరి జిల్లా ప్రత్తిపాడు మండలం ఏలేరు గ్రామానికి చెందిన రొంగల జ్యోతి అనే యువత ప్రయత్నిస్తున్నారు. ఇప్పటివరకూ 26 రాష్ట్రాల మీదుగా 18,200 కిలోమీటర్లు సైకిల్‌ యాత్ర నిర్వహించానని ఆమె వెల్లడించారు. కరోనా నేపథ్యంలో విరామం ప్రకటించానని.. మరో వారం రోజుల్లో యాత్ర కొనసాగిస్తానని జ్యోతి చెప్పారు. కాకినాడలోని గోదావరి సైక్లింగ్‌ క్లబ్‌ సభ్యులతో కలిసి 100 కిలోమీటర్ల సైకిల్ ‌రైడ్‌లో ఆమె ఆదివారం పాల్గొన్నారు.

భారతదేశంలో రోడ్ల మీద మహిళల భద్రతకు ఎలాంటి ఇబ్బందులు లేవన్న సందేశాన్ని ఇవ్వడానికి తాను యాత్ర చేపడుతున్నట్లు ఆమె తెలిపారు. కాకినాడలోని గోదావరి సైక్లింగ్‌ క్లబ్‌ సభ్యులు... జ్యోతి సాగిస్తున్న సైకిల్‌ యాత్రకు మద్దతు తెలిపారు. ఎంబీఏ వరకూ చదివి సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగం చేస్తున్న జ్యోతి మహిళల భద్రత సందేశంతో సైకిల్ యాత్ర నిర్వహించడటం అభినందనీయమన్నారు. ఆమె మరో 800 కిలోమీటర్లు ప్రయాణిస్తే 19వేల కిలోమీటర్ల సైకిల్ రైడ్​తో ఆస్ట్రేలియా పేరుతో ఉన్న గిన్నిస్ రికార్డు బద్దలుకొడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఎలాంటి ఆర్ధిక వనరులు లేకపోయినా ధైర్యంతో యాత్ర సాగిస్తుండటం స్ఫూర్తిదాయకమని అభినందించారు.

Last Updated : Oct 11, 2020, 6:50 PM IST

ABOUT THE AUTHOR

...view details