ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'దేన్నైనా పుట్టించే శక్తి ఆ ఇద్దరిదే.. వారి కోసమే నా యాత్ర'

దేన్నైనా పుట్టించే శక్తి ఇద్దరికే ఉంటుంది. ఒకటి నేలకి, రెండు ఆడవాళ్లకి. ఓ చిత్రంలో అల్లు అర్జున్​ చెప్పే డైలాగ్ ఇది. ఆ ఇద్దరిని కాపాడడానికి ఓ యువకుడు వినూత్న ప్రయత్నం చేస్తున్నాడు. వందల కిలోమీటర్లను సైకిల్​పై దాటేస్తూ.... దారి వెంట ఎదురయ్యే ప్రజలకు అవగాహన కల్పిస్తున్నాడు.

a young man cycling
a young man cycling

By

Published : Feb 7, 2020, 9:07 PM IST

ఆ ఇద్దరి కోసం... వందల కిలోమీటర్లు సైకిల్ యాత్ర

పర్యావరణ పరిరక్షణ, మహిళలకు భద్రతను కోరుతూ గుజరాత్ రాష్ట్రానికి చెందిన మయాంక్ మేడ అనే యువకుడు దేశవ్యాప్తంగా సైకిల్ యాత్ర చేస్తున్నారు. యాత్రలో భాగంగా తూర్పు గోదావరి జిల్లా ప్రత్తిపాడుకు చేరుకున్న అతను... ఈటీవీ భారత్​తో మాట్లాడాడు. తాను బేటి బచావో- బేటి పడావో కార్యక్రమానికి ఆకర్షితుడై... దేశంలో మహిళల భద్రతకు సంబంధించి ప్రజల్లో అవగాహన కల్పించడానికి సైకిల్ యాత్ర ప్రారంభించినట్లు తెలిపాడు. గుజరాత్​లో మొదలైన తన యాత్ర... మహారాష్ట్ర, గోవా, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల మీదుగా ఆంధ్రప్రదేశ్​కు చేరుకున్నట్లు వెల్లడించాడు. రోజుకు 150 నుంచి 200 కిలోమీటర్లు సైకిల్ తొక్కుతూ... మార్గమధ్యంలో కళాశాలలు, పాఠశాలలు, జన కూడళ్లలో అవగాహన కల్పిస్తున్నట్లు తెలిపాడు. ఫెడల్ ఫర్ గ్రీన్ వరల్డ్, విమెన్ అవేర్​నెస్ పేరిట ఈ యాత్ర కొనసాగిస్తున్నట్లు చెప్పాడు. భూటాన్, నేపాల్​కు తన యాత్ర కొనసాగుతుందన్నాడు మయాంక్.

ఇదీ చదవండి

'శస్త్ర​ చికిత్స చేశాకే నోటి నిండా వెంట్రుకలు పెరిగాయి!​'

ABOUT THE AUTHOR

...view details