ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

SELFIE SUICIDE: యువకుడు ఆత్మహత్య..ఎస్​ఐ, కానిస్టేబుల్​పై సస్పెన్షన్​ వేటు - రాజమండ్రి యువకుడు ఆత్మహత్య

young man committed suicide
యువకుడు ఆత్మహత్య

By

Published : Aug 11, 2021, 6:03 PM IST

Updated : Aug 11, 2021, 8:06 PM IST

17:55 August 11

యువకుడు ఆత్మహత్య

యువకుడి సెల్ఫీ వీడియో

రాజమహేంద్రవరంలో పిచ్చుక మజ్జి అనే యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసులు వేధిస్తున్నారని సెల్ఫీ వీడియో తీసి..సూసైడ్​చేసుకున్నాడు.  పిచ్చుక మజ్జిపై గతేడాది అక్రమ మద్యం రవాణా చేస్తున్నాడనే కారణంతో చిల్లకల్లు పోలీస్ స్టేషన్​లో కేసు నమోదు చేశారు. అయితే అరెస్ట్ పెండింగ్​లో ఉందని.. అతడిని చిలకల్లు పోలీస్ స్టేషన్​కు పిలిపించారు.

అసలేం జరిగింది..

ఈ క్రమంలో పోలీస్ స్టేషన్​కు వెళ్లిన తనపై విధుల్లో ఉన్న కానిస్టేబుల్ శివరామకృష్ణప్రసాద్ లక్ష రూపాయలు లంచం డిమాండ్ చేశాడని.. డబ్బు చెల్లిస్తే కేసులు మాఫీ చేస్తానని, లేకుంటే అక్రమంగా గంజాయి కేసులు బనాయిస్తానని బెదిరించాడని ఆరోపిస్తూ మజ్జి సెల్ఫీ వీడియో తీసి.. ఇంటి వద్ద ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. 

సస్పెన్షన్​ వేటు.. 

అక్రమ కేసులు బనాయిస్తామని యువకుని బెదిరించి అతని మరణానికి కారణమైన కానిస్టేబుల్ శివరామకృష్ణ ప్రసాద్, నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఎస్ఐ దుర్గా ప్రసాద్ రావులపై ఉన్నతాధికారులు సస్పెన్షన్ వేటు వేశారు. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న సిబ్బందిపై శాఖాపరంగా చర్యలు తీసుకోవడమే కాక, క్రిమినల్ కేసులు నమోదు చేసి, వారిని విధుల నుంచి తొలగించడానికి సైతం వెనుకాడబోనని ఎస్పీ సిద్ధార్థ్ కౌశల్ హెచ్చరించారు.

ఇదీ చదవండీ..Bio mining: డంపింగ్ యార్డుల్లో బయోమైనింగ్ విధానం.. చెత్తశుద్ధికి ముందడుగు

Last Updated : Aug 11, 2021, 8:06 PM IST

ABOUT THE AUTHOR

...view details