తల్లి ఇద్దరు బిడ్డలతోసహా కాల్వలో దూకి ఆత్మహత్యా యత్నానికి పాల్పడగా..సీఐ కాపాడిన ఘటన తూర్పు గోదావరి జిల్లాలో చోటుచేసుకుంది. గండేపల్లి మండలం జడ్. రాగంపేటకు చెందిన కర్నాటి బుజ్జి, కుమారుడు సాయి, లక్ష్మీ దుర్గలు.. జగ్గంపేట శివారు పోలవరం కాల్వలోకి దూకారు. ఘటనపై సమాచారం అందుకున్న సీఐ సురేశ్ బాబుకు సమాచారం రావడంతో వెంటనే అక్కడికి చేరుకుని వారిని రక్షించేందుకు ఒడ్డునుంచే యత్నించారు. ఎనిమిదేళ్ల సాయిని బయటకు లాగారు.
పిల్లలతో సహా పోలవరం కాల్వలోకి దూకిన మహిళ...తర్వాత.. - తూర్పు గోదావరి జిల్లా వార్తలు
![పిల్లలతో సహా పోలవరం కాల్వలోకి దూకిన మహిళ...తర్వాత.. Lady Jumped into Polavaram canal](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-13268712-126-13268712-1633442655876.jpg)
18:20 October 05
Lady Jumped into Polavaram canal : పిల్లలతో సహా పోలవరం కాల్వలోకి దూకిన మహిళ...తర్వాత..
కానీ.. తల్లీ బిడ్డను కాపాడే క్రమంలో సీఐ కాల్వలోకి జారి పడిపోయారు. అక్కడే ఉన్న ఇద్దరు యువకులు సీఐకి చెట్టు కొమ్మను అందించి బయటకు లాగారు. ఆపై తల్లి బుజ్జిని కూడా ఒడ్డుకు చేర్చారు. అపస్మారక స్థితిలోకి వెళ్లిన ఆమెను జగ్గంపేట ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఐదేళ్ల చిన్నారి లక్ష్మీ దుర్గ కోసం గాలిస్తున్నారు. తల్లీ బడ్డల్ని రక్షించే ప్రయత్నంలో సీఐకి ప్రాణాపాయం తప్పడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.
ఇదీ చదవండి:
YV Subba Reddy:'ప్రజల కోసమే అప్పులు.. తీర్చే సత్తా ప్రభుత్వానికి ఉంది'