తూర్పుగోదావరి జిల్లా ఏలేశ్వరం మండలం ఎర్రవరం వద్ద జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం(accident at Erravaram in west godavari district) జరిగింది. ద్విచక్ర వాహనాన్ని బస్సు ఢీకొట్టిన ఘటనలో ఓ మహిళ అక్కడికక్కడే మృతి చెందిగా... మరో ముగ్గురు గాయపడ్డారు. పెనుమంద్ర గ్రామానికి చెందిన సత్యనారయణ.. తన భార్య, ఇద్దరు పిల్లలతో ద్విచక్ర వాహనంపై విజయనగరం నుంచి స్వగ్రామం వెళ్తున్నారు.
ఈ క్రమంలో ఏలేశ్వరం మండలం ఎర్రవరం వద్ద జాతీయ రహదారిపై అవంతి కంపెనీ బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో సత్యనారయణ భార్య కల్యాణి అక్కడికక్కడే మృతి(a woman died in Erravaram Accident) చెందింది. గాయపడ్డ సత్యనారయణ, ఇద్దరు పిల్లలను ప్రత్తిపాడు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. గాయాలు తట్టుకోలేక.. చిన్నారుల ఏడ్పులను చూసి స్థానికులు కంటతడిపెట్టుకున్నారు.