లారీ ఢీ కొని పశ్చిమ బంగాల్‌కు చెందిన చిన్నారి మృతి - West Bengal child dead at east godavari news
తూర్పు గోదావరి జిల్లా ఆలమూరు మండలం చొప్పెల్ల జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో పశ్చిమ బంగాల్‌కు చెందిన ఐదేళ్ల చిన్నారి ఆసియా మృతి చెందింది. చిన్నారి తల్లిదండ్రులు రాజమహేంద్రవరం నుంచి ఇటుక బట్టీ పనుల కోసం నర్సాపురానికి వెళ్తూ చొప్పెళ్ల వద్ద తినడానికి ఆగారు. ఇంతలో పాప రోడ్డుపైకి వెళ్లగా.. వేమగిరి నుంచి రావులపాలెం వైపు వెళ్తున్న లారీ ఢీ కొట్టింది. ఈ ఘటనలో చిన్నారి అక్కడికక్కడే చనిపోయింది. తమ గారాల పట్టి మృత్యు ఒడికి చేరటంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు.