తూర్పు గోదావరి జిల్లా కోనసీమ ప్రాంతంలోని గోదావరి నది కోత ప్రాంతాలను ప్రభుత్వం నియమించిన ఉన్నత స్థాయి సాంకేతిక సలహా ఇంజనీర్ల బృందం పరిశీలించింది. అంతర్వేది, సఖినేటిపల్లి, రాజోలు, పుచ్చలంక, వై కొత్తపల్లి, గోపాలపురం, పొడగట్లపల్లి తదితర ప్రాంతాల్లో నదీ కోత తీవ్రతను బృందం సభ్యులు పరిశీలించారు. ఈ నెల 5 నుంచి ఇంజనీర్ల బృందం ఉభయగోదావరి జిల్లాల్లో నదీ కోత ప్రభావిత ప్రాంతాలను పరిశీలించారు.. నేటితో పర్యటన ముగిసింది. దీనిపై మరో నాలుగు రోజుల్లో ప్రభుత్వానికి నివేదిక అందజేస్తామని బృంద సభ్యుడు విశ్రాంతి జలవనరుల శాఖ చీఫ్ ఇంజనీర్ గిరిధర్ రెడ్డి వెల్లడించారు.
గోదావరి నది కోత ప్రభావిత ప్రాంతాల్లో ఇంజనీర్ల బృందం పర్యటన - engineers visits at east godavari district latest news update
గోదావరి నది కోత ప్రాంతాలను ఉన్నత స్థాయి సాంకేతిక సలహా ఇంజనీర్ల బృందం పరిశీలించింది. ఈ నెల 5 నుంచి నేటి వరకు మూడు రోజులపాటు ఉభయ గోదావరి జిల్లాల్లోని నది పరివాహక ప్రాంతాల్లో ఈ బృందం పర్యటించింది.
గోదావరి నది కోత ప్రభావితం ప్రాంతాల్లో ఇంజనీర్ల బృందం పర్యటన