ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఉపాధ్యాయుడి కుటుంబం.. పేదలకు అన్నదానం - ఏపీలో కరోనా కేసులు

లాక్​డౌన్ వేళ ఇబ్బందులు పడుతున్న పేద ప్రజలకు తమ వంతు సాయంగా నిత్యం భోజనం పెడుతోంది ఒక ఉపాధ్యాయ కుటుంబం.

family food supply
family food supply

By

Published : Apr 30, 2020, 1:52 PM IST

తూర్పు గోదావరి జిల్లా ఆత్రేయపురం మండలం ర్యాలి గ్రామానికి చెందిన చింత శ్యాం కుమార్ ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా పని చేస్తున్నాడు. భార్య, కుమారుడితో కలిసి ప్రతిరోజు పేద ప్రజలను ఆదుకుంటున్నారు. రోడ్డు చెంతన నివసించే 50 మంది యాచకులకు భోజనాలను అందిస్తున్నారు. స్వయంగా ఇంట్లో వండి.. ప్యాకెట్లు తయారు చేసి ఇస్తున్నారు.

గ్రామాల్లో పేదలకు నిత్యవసర వస్తువులను అందిస్తున్నారు. వారు అందించే నిత్యావసర సరుకులను ఒక స్టాల్ గా ఏర్పాటు చేసి.. ఒక్కొక్కరు వచ్చి వారికి కావాల్సినవి తీసుకునేలా విధంగా పెట్టారు. కరోనా వైరస్ రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పిస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details