తూర్పు గోదావరి జిల్లా రావులపాలెం మండలంలో కరోనా వైరస్ తాండవం చేస్తుంది. ఒక్కరోజులో 45 కేసులు నమోదు కావటంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. మండలంలో ఇప్పటికే 21 కేసులు ఉండగా తాజా కేసులతో కరోనా బాధితుల సంఖ్య 66కు చేరింది. ఊబలంక పీహెచ్సీ వద్ద గురువారం రాత్రి 243 మందికి రాపిడ్ కిట్ల ద్వారా పరీక్షలు చేయగా 45 పాజిటివ్ కేసులు వచ్చినట్లు వైద్యాధికారి దుర్గాప్రసాద్ తెలిపారు. మరో 81 మంది ఫలితాలు రావాల్సి ఉందన్నారు.
రావులపాలెం మండలంలో కరోనా తాండవం... ఒక్క రోజులో 45 కేసులు - తూర్పు గోదావరి జిల్లాలో కరోనా కేసులు
తూర్పు గోదావరి జిల్లా రావులపాలెం మండలంలో కరోనా కలవరం పెడుతోంది. ఊబలంక పీహెచ్సీలో నిర్వహించిన రాపిడ్ పరీక్షల్లో 45 మందికి పాజిటివ్ వచ్చింది. ఈ కేసులతో మండలంలో కరోనా బాధితుల సంఖ్య 66కు చేరింది.
a-steep-increase-of-corona-cases-in-ravulapalem-mandel-in-east-godavari-dist
కొత్తపేట ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి గన్ మెన్కు పాజిటివ్ రావటంతో వారి అనుచరవర్గం అంతా పరీక్షలు చేయించుకున్నారు. వారిలో ఎక్కువ మందికి కరోనా నిర్ధరణ అయ్యింది. కేసులు భారీగా పెరగడానికి పుట్టినరోజు వేడుకలు, ఛాంబర్ సమావేశాలే కారణమని పలువురు అంటున్నారు.
ఇదీ చదవండి :శ్రీకాళహస్తి ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డికి కరోనా పాజిటివ్