శానిటైజర్లు, మాస్కులు పంపిణీ చేసిన విశ్రాంత ఉపాధ్యాయుడు - retired teacher sanitizers distribution news in ravulapalem
ప్రజలు అప్రమత్తంగా ఉంటే కరోనా కట్టడి చేయవచ్చని రావులపాలెం మండలం గోపాలపురానికి చెందిన విశ్రాంతి ఉపాధ్యాయుడు బండి వర ప్రసాదరావు అన్నారు. కరోనా కట్టడికి కృషి చేస్తున్న గ్రామ వాలంటీర్లకు, పారిశుద్ధ్య కార్మికులకు ఆయన శానిటైజర్లు, మాస్కులు పంపిణీ చేశారు.
![శానిటైజర్లు, మాస్కులు పంపిణీ చేసిన విశ్రాంత ఉపాధ్యాయుడు శానిటైజర్లు, మాస్కులు పంపిణీ చేసిన విశ్రాంత ఉపాధ్యాయుడు](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7126561-974-7126561-1589019463945.jpg)
శానిటైజర్లు, మాస్కులు పంపిణీ చేసిన విశ్రాంత ఉపాధ్యాయుడు
ప్రజల అప్రమత్తంగా ఉండి తగు జాగ్రత్తలు తీసుకుంటే కరోనాను కట్టడి చేయవచ్చని తూర్పుగోదావరి జిల్లా గోపాలపురానికి చెందిన విశ్రాంతి ఉపాధ్యాయుడు బండి వర ప్రసాదరావు పేర్కొన్నారు. కరోనా లాంటి సమయంలో ప్రజలకు చేసిన సేవలు గుర్తింపు తీసుకొస్తుందని అన్నారు. గ్రామంలో కరోనా వైరస్ కట్టడికి కృషి చేస్తున్న వాలంటీర్లకు, పారిశుద్ధ్య సిబ్బందికి ఆయన శానిటైజర్లు, మాస్కులు, వాటర్ బాటిళ్లను పంపిణీ చేశారు.