ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

Pregnant woman dies: ఓ బిడ్డకు జన్మనిచ్చి.. మరో బిడ్డ పుట్టేలోగా.. - east godavari district latest news

తన కడుపున కవలలు పుడతారని తెలిసి.. ఆమె మురిసిపోయింది. నవమాసాలు గడిచి పురిటినొప్పులు మొదలయ్యాయి. ఓ బిడ్డకు జన్మనిచ్చిన ఆ తల్లి.. మరో బిడ్డను ఈ భూమ్మీదకు తీసుకురాకుండానే(woman dies while giving birth to a child) కన్నుమూసింది. ఈ ఘటన తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో జరిగింది.

Pregnant woman dies while giving birth to another child
బిడ్డ పుట్టేలోగా గర్భిణి మృతి

By

Published : Sep 28, 2021, 11:45 AM IST

తన కడుపున కవలలు పుడతారని తెలిసి మురిసిపోయిన ఆమె.. ఓ బిడ్డకు జన్మనిచ్చి.. మరో బిడ్డను ఈ భూమ్మీదకు తీసుకురాకుండానే కన్నుమూసిన(woman dies while giving birth to a child at west godavari district) ఘటన తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో జరిగింది. మారేడుమిల్లి మండలం దేవరపల్లికి చెందిన గిరిజన మహిళ కోండ్ల సరస్వతికి ఆదివారం రాత్రి పురిటినొప్పులు రాగా ఇంటివద్దే కాన్పునకు సిద్ధమయ్యారు. అక్కడే ఒక బిడ్డకు జన్మనిచ్చింది. రెండో బిడ్డ ప్రసవానికి ఇబ్బందులు ఎదురవడంతో మారేడుమిల్లి పీహెచ్‌సీకి తరలించారు. అక్కడి వైద్యులు మెరుగైన వైద్యం కోసం రంపచోడవరం ఏరియా ఆసుపత్రికి పంపించారు. మళ్లీ పరిస్థితి విషమంగా ఉందని రాజమహేంద్రవరం జనరల్‌ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ కడుపులో బిడ్డతో సహా సరస్వతి(woman died at rajamahendravaram) చనిపోయింది. వైద్యుల నిర్లక్ష్యంతోనే ఇలా జరిగిందని బంధువులు ఆరోపించారు.

ఆసుపత్రి గైనకాలజిస్టు డాక్టర్‌ ప్రమీలను వివరణ కోరగా ఆమె ఆరోగ్యం పూర్తిగా విషమించిన తర్వాత ఇక్కడికి తీసుకొచ్చారని, రక్తహీనత సమస్యతోనూ బాధపడుతోందని చెప్పారు. ఇంటిదగ్గర పుట్టిన బిడ్డ ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది.

ABOUT THE AUTHOR

...view details