సైకిల్ తొక్కుకుంటూ ట్రాఫిక్‌లో దూసుకుపోతున్న ఈ పెద్దాయన పేరు ఆకుల వెంకట్రావు. సొంతూరు తూర్పు గోదావరి జిల్లా కడియం మండలంలోని కడియపు సావరం. పూల తోటలు, నర్సరీలకు ప్రసిద్ధిగాంచిన కడియం ప్రాంతంలో.. పూలు అమ్ముతూ జీవనం సాగిస్తున్నారు. పదకొండేళ్ల వయస్సులో పువ్వుల అమ్మకం మొదలుపెట్టినప్పటి నుంచి సైకిల్‌పైనే ఊరూరా తిరుగుతూ విక్రయిస్తున్నారు. తొలి రోజుల్లో గోదావరిలో లాంచీపైన, ధవళేశ్వరం కాటన్ వంతెనపై నుంచి నిడదవోలు వెళ్లి పూలు అమ్మేవారు. ప్రస్తుతం రాజమహేంద్రవరం మీదుగా కొవ్వూరు వరకూ వెళ్లి తన వ్యాపారం కొనసాగిస్తున్నారు.
గతంలో ఆనకట్ట మీద నుంచి వెళ్లి నిడదవోలులో అమ్ముకునేవాడిని. తర్వాత రాజమండ్రి బ్రిడ్జి కట్టారు. అప్పట్నుంచి రాజమండ్రి, కొవ్వూరులో పూలు అమ్ముతున్న. అప్పుడు రూపాయి పావలా వచ్చేది.. తర్వాత మూడు రూపాయాలు లాభమొచ్చేది. పొద్దున్నే చద్దన్నం తిని ఏడున్నర, ఎనిమిది మధ్యలో పూలు అమ్మడానికి వెళ్తాను. ఆ సైకిల్‌తో నలుగురు పిల్లల పెళ్లి చేశారు. సైకిల్ ఎలా వదులుతానండీ.. వదలను. మా పిల్లలు కాని బంధువులు కాని వస్తే సైకిలివ్వను.. కావాలంటే పది రూపాయలిత్తాను కానీ సైకిల్ మాత్రం ఇవ్వను. - వెంకట్రావు, పూలమ్మే వ్యక్తి
పూల వ్యాపారం చేస్తూ నలుగురు పిల్లల్ని పెంచి, పెద్ద చేశానని, అరెకరం భూమి కొని.. అందులో పూల తోట సాగు చేస్తున్నానని వెంకట్రావు తెలిపారు. పొద్దున్నే లేవటం.. పూలు కోసి, బుట్టల్లో సర్దుకుని సైకిల్‌పై తన ప్రయాణం సాగిస్తానని చెప్పారు. సుమారు యాభై ఏళ్ల క్రితం కొన్న సైకిల్‌పైనే ఇప్పటికీ ప్రయాణిస్తున్న వెంకట్రావు.. తనకు ఆ సైకిల్ ఎంతో అపురూపమంటున్నారు.
20 సంవత్సరాల నుంచి నాకు బాగా తెల్సండి. చాలా మంచోడు. సైకిల్ మీదే యాపారమండి ఆయనది. ఈ రోజుల్లో సైకిల్ మీద చేసినవాళ్లెవరున్నారండీ... బళ్లు కొనుక్కొని అమ్ముతున్నారు . ఆయన ఓపికకి మొచ్చుకోవచ్చండి. ఆ వయసులో అలా చేస్తున్నాడంటే. చాలా చక్కగా ఆరోగ్యంగా, గట్టి శరీరమండి ఆయనది. ఆరోగ్యంగా ఉన్నాడు కాబట్టే చేస్తున్నాడండి. ఈరోజుల్లో మనం చేయలేమండి.
-వరలక్ష్మి, రాజమహేంద్రవరం
30 సంవత్సరాల నుంచి నేను చూస్తున్నానండీ ఇతన్ని. గుడికేమో దండలు ఫ్రీగా వేస్తాడండి.