ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

నిలువ నీడ లేదు... అయినవారిని అడగలేదు - old women desidence in toilet

నా కూతురు వచ్చింది... మనవరాలు వచ్చారు అని అందరికీ చెప్పుకోవాలని ఆ అమ్మకి ఆరాటమే.. ఒకవేళ వాళ్లే వచ్చినా మమకారం చంపుకొని కన్నీళ్లతోనే వెళ్లిపొమ్మని చెప్తుంది. ఒంట్లో శక్తి లేని వృద్ధాప్యం... భరించరాని పేదరికం... ఎవ్వరికీ చెప్పుకోలేని దీనస్థితి. ఉండటానికి ఇల్లు లేక... మరుగుదొడ్డిలోనే జీవనం సాగిస్తోంది ఓ వృద్ధురాలు.

a old women desidence in  toilet at east godavari district
మరుగుదొడ్డిలో నివాసముంటున్న వాసంశెట్టి వీరమ్మ

By

Published : Dec 21, 2019, 7:44 PM IST

నిలువ నీడ లేదు... అయినవారిని అడగలేదు

దారిద్య్రం ఆ అమ్మని ఒంటరిదాన్ని చేసింది. పిల్లలను పెద్ద చేసిపెళ్లిళ్లు చేసినా.. వారి బతుకులు అంతంత మాత్రమే. ఈ నేపథ్యంలో వాళ్లని ఏమీ అడగలేదు... వారితో సంతోషంగా గడపలేదు. ఒంటరి జీవితంలో ఆమె పడుతున్న అవస్థలు అన్నీఇన్నీ కాదు. పూరిల్లు కూలిపోయి నిలువ నీడ లేక మరుగుదొడ్డినే ఆవాసంగా మార్చుకొని జీవనం సాగిస్తోంది వృద్ధురాలు.

తూర్పుగోదావరి జిల్లా పి .గన్నవరం నియోజకవర్గంలోని జి .పెదపూడి గ్రామానికి చెందిన వాసంశెట్టి వీరమ్మ అనే వృద్ధురాలు మరుగుదొడ్డిలోనే జీవితం వెళ్లదీస్తోంది. ఆమె భర్త రెండేళ్ల క్రితం చనిపోయాడు. వారికి ఇద్దరు కుమార్తెలు కాగా...ఒక కుమార్తె భర్త చనిపోయాడు. వారివి చాలీచాలనీ బతుకులే...ఇద్దరు కుమార్తెలు దూర ప్రాంతంలో దయనీయంగా జీవిస్తున్నారు. ఇక ఒంటరిగా ఉన్న వృద్ధురాలు వీరమ్మ ఇల్లు కట్టుకునే స్థోమత లేక మరుగుదొడ్డిలోనే బతుకీడుస్తోంది.

తలదాచుకునేందుకు ఇంటి నిర్మాణానికి ప్రభుత్వం సహకరించాలని వేడుకుంటోంది. దాతలు ఆదుకోవాలని విజ్ఞప్తి చేస్తోంది.

ఇదీచూడండి.పక్షులంటే రామలక్ష్మికి ప్రాణం... పొద్దుగాల్నే లేచి...

ABOUT THE AUTHOR

...view details