అరకు జిల్లా ఏర్పాటుతోనే ఆదివాసీలు అభివృద్ధి చెందుతారని ఆదివాసీ సంక్షేమ పరిషత్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కుంచ శ్రీను అన్నారు. శనివారం తూర్పుగోదావరి జిల్లా రంపచోడవరం మండలం ఇర్లపల్లి గ్రామంలో సంఘం సమావేశం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నూతన జిల్లాల ఏర్పాటు కార్యాచరణలో భాగంగా అరకు పార్లమెంటు నియోజకవర్గాన్ని కలిపి జిల్లాగా ఏర్పాటు చేయడం గిరిజనులకు శుభపరిణామమన్నారు. అయితే కొంతమంది స్వలాభాల కోసం రంపచోడవరం జిల్లాను తెరపైకి తీసుకురావడం జరిగిందన్నారు. ముఖ్యంగా గిరిజన చట్టాలను తుంగలో తొక్కాలని ఉద్దేశంతో ప్రయత్నాలు సాగిస్తున్నారని అన్నారు. ఆదివాసీలంతా దీనిని తిప్పి కొట్టాలని అన్నారు.
'అరకు జిల్లాతోనే ఆదివాసీల అభివృద్ధి' - రంపచోడవరం వార్తలు
తూర్పుగోదావరి జిల్లా రంపచోడవరం మండలం ఇర్లపల్లి గ్రామంలో ఆదివాసీల సంఘం సమావేశం జరిగింది. అరకు జిల్లా ఏర్పాటుతోనే ఆదివాసీలు అభివృద్ధి చెందుతారని ఆదివాసీ సంక్షేమ పరిషత్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కుంచ శ్రీను అన్నారు.
ఇర్లపల్లిలో ఆదివాసీల సంఘం సమావేశం