ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

rape: వివాహితపై అత్యాచారం.. నిందితుడు అరెస్ట్

తూర్పుగోదావరి జిల్లా(East Godavari district)లో ఓ వివాహితపై జరిగిన అత్యాచారం( married woman raped) ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడి అరెస్ట్ చేశారు. దిశ యాప్ ద్వారా.. నేర స్థలాన్ని గుర్తించడం సులభతరమైందని, ప్రతి ఒక్కరూ దిశ యాప్​(disha app)ను డౌన్లోడ్ చేసుకోవాలని సూచించారు.

rape
rape

By

Published : Oct 27, 2021, 7:09 PM IST

తూర్పు గోదావరి జిల్లా(East Godavari district)కు చెందిన ఓ వివాహితపై అత్యాచారం( married woman raped) జరిగిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఘటనపై మండపేట రూరల్ సీఐ శివ గణేష్, ఆలమూరు ఎస్ఐ శివప్రసాద్​లతో కలిసి రామచంద్రపురం డీఎస్పీ బాలచంద్రారెడ్డి ఆలమూరు పోలీస్ స్టేషన్​లో మీడియా సమావేశం ఏర్పాటుచేశారు.

ఈనెల 23వ తేదీ తెల్లవారుజామున 3 గంటలకు ఆలమూరు మండలంలోని ఓ గ్రామ పరిసరాల్లోంచి దిశ యాప్(disha app)​కు ఫోన్ వచ్చిందని పోలీసులు తెలిపారు. ఫోన్ లోకేషన్ ఆధారంగా సంఘటనా స్థలానికి వెళ్లగా.. అక్కడ ఎవరూ కనిపించకపోవటంతో.. వెనక్కి తిరిగి వచ్చామన్నారు. ఆ తర్వాత దిశ యాప్​నకు వచ్చిన ఫోన్ నెంబర్​తో అనుసంధానమైన కాంటాక్ట్ నెంబర్లకు ఫోన్ చేసినప్పటికీ.. బాధితురాలిని గుర్తించలేకపోయామన్నారు. సమీపంలో గల ఆస్పత్రులను తనిఖీ చేయగా.. మండపేట ప్రభుత్వ ఆసుపత్రిలో బాధితురాలు చికిత్స పొందుతున్నట్లు గుర్తించి వివరాలు సేకరించామని తెలిపారు.

వివాహితపై అత్యాచారం.. నిందితుడు అరెస్ట్

అద్దె ఇల్లు చూపిస్తామని..
భర్తకు దూరంగా ఉంటున్న వివాహిత తన తల్లిదండ్రులకు భారం కాకుండా ఉండేందుకు ఓ అద్దె ఇల్లు చూస్తుండగా.. మూడు నెలల క్రితం పరిచయమైన వడ్లమూరు చెందిన అంగర రాఘవులు ఆమె పరిస్థితిని ఆసరాగా తీసుకుని పథకం ప్రకారం తన స్నేహితుడు దుర్గా ప్రసాద్​ సహాయంతో అత్యాచారం చేశాడని పోలీసులు తెలిపారు. ఈనెల 22వ తేదీ రాత్రి 9 గంటల ప్రాంతంలో బాధితురాలికి అద్దె ఇల్లు చూపిస్తానని చెప్పి తన ద్విచక్రవాహనంపై జొన్నాడ వైపు తీసుకెళ్లారని పోలీసులు తెలిపారు.

బాధితురాలు తనను ఇంటి వద్ద దింపమని ప్రాధేయపడగా.. బంధువుల ఇంటి వద్ద రాత్రికి ఉండి రేపు ఉదయాన్నే తన ఇంటి వద్ద దింపుతానని నమ్మబలికి.. గుర్తు తెలియని ప్రదేశానికి తీసుకెళ్లి ఆత్యాచారం చేసినట్లు బాధితురాలు తన వాంగ్మూలంలో తెలిపింది. బాధితురాలు "దిశ" యాప్ సహాయం కొరకు ఫోన్ చేయగా రాఘవులు ఫోన్ లాక్కుని స్విచ్ ఆఫ్ చేశాడని చెప్పింది. ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. నిందితుడు రాఘవులును అరెస్ట్ చేశారు. అతనికి సహకరించిన దర్గాప్రసాద్ పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. దిశ యాప్(disha app) ద్వారా నేర స్థలాన్ని గుర్తించడం సులభతరమైయ్యిందని పోలీసులు తెలిపారు. ప్రతి ఒక్కరు దిశ యాప్​ను డౌన్లోడ్ చేసుకోవాలి సూచించారు.

ఇదీ చదవండి

Fire Accident News: మద్యం డిపోలో భారీ అగ్నిప్రమాదం... కోట్లలో ఆస్తినష్టం..!

Rape: ఎనిమిదో తరగతి బాలికపై మేనమామ అత్యాచారం

ABOUT THE AUTHOR

...view details