ఆత్మహత్య చేసుకుందామని గోదావరిలోకి దూకిన వ్యక్తిని... పోలీసులు కాపాడిన ఘటన తూర్పుగోదావరి జిల్లా జొన్నాడ గౌతమి వంతెన వద్ద చోటు చేసుకుంది. పశ్చిమ గోదావరి జిల్లా అత్తిలికి చెందిన కీలపర్తి శ్రీనివాసరావు... మంగళవారం ఆత్మహత్య చేసుకుందామని గోదావరిలో దూకాడు.
అంతలోనే ప్రాణాలపై ఆశ పుట్టింది. కొద్దిదూరం కొట్టుకుని వెళ్లాక ఇసుక దిబ్బ తగలగా.. చెట్లను పట్టుకుని ఉండిపోయాడు. సుమారు 15 గంటలపాటు నిరీక్షించగా...స్థానికులు అతడిని గమనించారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. అప్రమత్తమైన పోలీసులు...బోటును పంపి అతడిని ఒడ్డుకు చేర్చారు.