ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

భార్యను కిరాతకంగా హత్య చేసిన భర్త - man killed his wife news

రెండు నెలల్లో పెళ్లి భాజాలు మోగాల్సిన ఇంట్లో రక్తం చిందింది. భర్తే కాలయముడై భార్యను అతి కిరాతకంగా హత్య చేశాడు. ఈ ఘటన తూర్పుగోదావరి జిల్లాలో జరిగింది.

wife murder
wife murder

By

Published : Nov 12, 2020, 8:32 PM IST

తూర్పుగోదావరి జిల్లా అల్లవరం మండలం యెంట్రుకోన గ్రామంలో భార్యను వ్యక్తి గొడ్డలితో నరికి హత్య చేశాడు. పోలీసుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన శ్రీనివాసరావు తన భార్య వెంకటలక్ష్మి(40)ని గురువారం ఇంట్లోనే గొడ్డలితో నరికి చంపాడు. వెంకటలక్ష్మి అక్కడికక్కడే మృతి చెందింది. వీరి మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయని స్థానికులు వెల్లడించారు.

వీరికి 28, 26 సంవత్సరాల వయస్సు ఉన్న ఇద్దరు కుమారులు ఉన్నారు. పెద్ద కుమారుడికి ఇటీవలే వివాహం నిశ్చయమైంది. మరో రెండు నెలల్లో వివాహం జరగాల్సి ఉంది. నిందితుడు శ్రీనివాసరావు పరారీలో ఉన్నాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details