ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

బావిలో మృతదేహం.. చనిపోయాడా... చంపేశారా? - చెన్నంపల్లిలో బావిలో పడి యువకుడు మృతి

ఈతకని పొద్దున అనగా వెళ్లాడు. వస్తాడులే ఊళ్లోనే కదా అనుకున్నారు ఆ తల్లిదండ్రులు. పొద్దుపోయింది. చిమ్మచీకటైనా ఇల్లు చేరలేదు. తమ గారాల కుమారుడు ఏమైపోయాడో అని వెతికిన వారికి.. చివరికి విషాదమే మిగిలింది. బావిలో శవమై తేలిన కుమారుడిని చూసి.. వారి గుండె పగిలింది.

a man died in well due to swimming at Cennampalli in east godavari
a man died in well due to swimming at Cennampalli in east godavari

By

Published : Apr 7, 2020, 3:53 PM IST

అనంతపురం జిల్లా బుక్కరాయసముద్రం మండలం చెన్నంపల్లి గ్రామానికి చెందిన సాయి అనే 15 ఏళ్ల యువకుడు సోమవారం ఈతకు వెళ్ళాడు. కుమారుడు రాత్రయినా ఇంటికి రాకపోయేసరికి.. తల్లిదండ్రులు చుట్టుపక్కలంతా వెతికారు. ఊరి సమీపంలో బావిలో శవంగా తేలుతున్న కనిపించాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. బావిలో మృతదేహం కనిపించిన తీరుపై ఆరా తీస్తున్నారు. ఈత రాకనే చనిపోయాడా లేక మరేదైనా కారణం ఉందా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details