ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కోడికత్తి గుచ్చుకుని వేరువేరు ఘటనల్లో ఇద్దరు వ్యక్తులు మృతి - A man died after being stabbed by cockfight

cockfight
కోడికత్తి గుచ్చుకుని మృతి

By

Published : Jan 15, 2023, 4:24 PM IST

Updated : Jan 16, 2023, 6:10 AM IST

16:16 January 15

కోడికత్తి గుచ్చుకుని ఇద్దరు వ్యక్తులు మృతి

ప్రభుత్వాలు ఎన్ని ఆంక్షలు పెట్టినా కోడిపందాల నిర్వహణ ఆగడంలేదు. నిర్వాహకులపై కేసులు పెట్టినా.. కోడిపందాల నిర్వహించే వారిపై ఎలాంటి ప్రభావాన్ని చూపడం లేదు.. పైగా పందేల నిర్వహణలో రాజకీయ నాయకులు ఉండటంతో వారిని ఎదురించేందుకు కొన్ని ప్రాంతాల్లో పోలీసులు వెనకడుగు వేయాల్సివస్తోంది. మరికొన్ని ప్రదేశాల్లో అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, ఎంపీలు... బాహాటంగానే పందేలు నిర్వహిస్తున్నా... వారిపై చర్యలు చేపట్టేందుకు సాహసించలేని పరిస్థితులు నెలకొన్నాయి. ఈ సంద‌ర్భంలో కోడిపందాల్లో కోడి కత్తి గుచ్చుకుని ఇద్దరు వ్యక్తులు మృతి చెందిన ఘటన తూర్పు గోదావరి, కాకినాడ జిల్లాల్లో చోటు చేసుకున్నాయి.

తూర్పు గోదావరి జిల్లా: నల్లజర్ల మండలం అనంతపల్లిలో కోడికత్తి గుచ్చుకుని పద్మరాజు అనే వ్యక్తి మృతి చెందిన ఘటన నెలకొంది. కోడిపందాలు చూస్తుండగా ఓ కోడి ఎగిరి వచ్చి పద్మరాజు కాలు తెగింది. దాంతో అతనికి తీవ్ర రక్త స్రావమైంది. ఆసుపత్రికి ఆసుపత్రికి తీసుకెళ్తుండగా పద్మరాజు మృతి చెందారు. ఘటనపై నల్లజర్ల పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కోడిపందాల నిర్వాహకుల వివరాలు తెలియాల్సి ఉంది.

కాకినాడ జిల్లా: కిర్లంపూడి మండలం వేలంకలో కోడిపందాల్లో కోడికి కత్తి కడుతుండగా కత్తి తెగి వ్యక్తి మృతి చెందిన ఘటన చోటు నెలకొంది.కోడి కాలికి కత్తి కడుతుండగా 45 ఏళ్ల సురేష్​కు కోడి కత్తి చేతి మణికట్టు తగిలి నరం తెగి పోయింది. సురేష్​ను ఆటోలో ప్రత్తిపాడు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. తీవ్ర రక్త స్రావం కావడంతో సురేష్ చనిపోయినట్లు వైద్యులు తెలిపారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న కిర్లంపూడి పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.

ఇవీ చదవండి:

Last Updated : Jan 16, 2023, 6:10 AM IST

ABOUT THE AUTHOR

...view details