ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఆర్టీసీ బస్సును ఢీకొన్న లారీ.. తప్పిన పెను ప్రమాదం - east Godavari district latest news

తూర్పుగోదావరి జిల్లా రాజోలులో త్రుటిలో పెను ప్రమాదం తప్పింది. స్థానిక రమేశ్ ఆస్పత్రి సమీపంలో ఆర్టీసీ బస్సును వెనుక నుంచి లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బస్సులోని ప్రయాణీకులందరూ సురక్షితంగా బయటపడ్డారు.

a lorry hit a rtc bus at razole
ఆర్టీసీ బస్సును ఢీకొన్న లారీ

By

Published : Mar 3, 2021, 4:51 PM IST

తూర్పుగోదావరి జిల్లా రాజోలులో రమేశ్ ఆస్పత్రి సమీపంలో ఆర్టీసీ బస్సును వెనుక నుంచి లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఎవరికి ఎటువంటి గాయాలు కాలేదు. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో సుమారు 30 మంది ప్రయాణికులు ఉన్నారు. త్రుటిలో ప్రమాదం తప్పడం వల్ల ప్రయాణీకులు, స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. అమలాపురం నుంచి భీమవరం వెళ్తుండగా ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో బస్సు బంపర్ మరమ్మతులకు గురైనట్లు ఆర్టీసీ ఆధికారులు తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details