తూర్పుగోదావరి జిల్లా అంతర్వేది సముద్ర తీరానికి.. చనిపోయిన భారీ డాల్ఫిన్ కొట్టుకొచ్చింది. ఒడ్డున ఉన్న మత్స్యకారులకు భారీగా కనిపించడంతో బోటుపై వెళ్లి చూశారు. అప్పటికే కుళ్లిపోయిన స్థితిలో ఉందని వారు తెలిపారు. వయసు పెరగడం వల్ల కానీ, ఓడల వెనుకున్న పంకా తగలడం, ఆయిల్ సంస్థలు సిస్మిక్ సర్వేలు నిర్వహించినపుడు గానీ.. యంత్రాలు తగిలి చనిపోయి ఉంటుందని మత్స్యశాఖ ఏడీ కృష్ణరావు చెప్పారు. ఈ డాల్ఫిన్ చనిపోయి 10 రోజుల పైగానే అయి ఉంటుందని తెలిపారు.
అంతర్వేది తీరంలో భారీ డాల్ఫిన్ మృత కళేబరం
అంతర్వేది సముద్ర తీరానికి చనిపోయిన భారీ డాల్ఫిన్ కొట్టుకువచ్చింది. గమనించిన మత్స్యకారులు.. కుళ్లిపోయిన స్థితిలో ఉందని తెలిపారు. డాల్ఫిన్ చనిపోయి 10రోజులకుపైగా అయి ఉంటుందని మత్స్యశాఖ ఏడీ కృష్ణరావు చెప్పారు.
huge dead dolphin washed up at antarvedi