ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

గోదావరిలో వేటకు వెళ్లిన మత్స్యకారుడు మృతి - ఈటీవీ భారత్​ తాజా వార్తలు

తూర్పుగోదావరి జిల్లాలో మూడు రోజుల క్రితం చేపలవేటకు వెళ్లి అదృశ్యమైన మత్స్యకారుడు రాజు సోమవారం విశిష్ఠ గోదావరిలో శవమై తేలాడు. అతని భార్య ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

a fisherman dead at east godavari
గోదావరి నదిలో వేటకు వెళ్లిన మత్స్యకారుడు మృతి

By

Published : Jul 6, 2020, 6:14 PM IST

తూర్పు గోదావరి జిల్లా రాజోలుకు చెందిన మత్స్యకారుడు ఇల్లింగి రాజు మూడు రోజుల క్రితం గోదావరిలో చేపల వేటకి వెళ్లి అదృశ్యమయ్యాడు. అతని మృతదేహం సోమవారం రాజోలు వద్ద వశిష్ఠ గోదావరిలో తేలింది. రాజుకు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. రాజు భార్య ఫిర్యాదు మేరకు రాజోలు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details