లాక్డౌన్లో భాగంగా తూర్పు గోదావరి జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గంలో పోలీసులు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు. మాట వినకుండా రోడ్లపైకి వస్తున్న వారికి లాఠీదెబ్బ రుచి చూపిస్తున్నారు. గ్రామాల్లో ప్రజలు స్వీయ నియంత్రణ పాటిస్తున్నారు. ప్రత్తిపాడు మండలం చిన్న శంకర్ల పూడి గ్రామస్తులు.. తమ ఊరిలోకి ఎవరూ రాకుండా కంచె వేశారు. అక్కడే పోలీస్ సైరన్ వచ్చే విధంగా ఏర్పాటు చేశారు. వారి గ్రామానికి వారే కాపలా కాస్తున్నారు.
కరోనా భయంతో ఊరికి కంచెలు.. అయినా రోడ్డెక్కితే దండనలు - A fence was placed between the villages as the Kororna virus did not spread
కరోనా వైరస్ కారణంగా దేశమంతటా లాక్డౌన్ విధించారు. ప్రజలెవ్వరూ బయటకురావద్దంటూ అధికారులు ఆంక్షలు విధించారు. తూర్పు గోదావరి జిల్లా పత్తిపాడు పరిధిలోని కొందరు.. ఈ మహమ్మారికి భయపడి వారి ఊర్లను కాపాడుకునే దిశగా... సరిహద్దుల్లో కంచెలు వేశారు.మరోవైపు కొందరు ఘనులు మాత్రం అనవసరంగా రోడ్లపై తిరుగుతున్నారు.విసుగుచెందిన పోలీసులు లాఠీలకు పనిచెప్పారు.
![కరోనా భయంతో ఊరికి కంచెలు.. అయినా రోడ్డెక్కితే దండనలు A fence was placed between the villages as the cororna virus did not spread](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6546049-424-6546049-1585198732614.jpg)
A fence was placed between the villages as the cororna virus did not spread
భయంతో ఊరికి కంచెలు ఓ వైపు...రోడ్లెక్కితే బాదుడు మరోవైపు
ఇదీ చూడండి: