మృతుల అంతిమ సంస్కారాలు నిర్వహించే రుద్ర భూమిలో వసతులు కల్పించేందుకు దాతలు ముందుకు రావాలని తూర్పుగోదావరి జిల్లా పి.గన్నవరం శాసనసభ్యులు కొండేటి చిట్టిబాబు అన్నారు. మానేపల్లిలో స్మశాన వాటికలో విశ్రాంత భవనం నిర్మించేందుకు పితాని శ్రీనివాస రావు అనే దాత 10 లక్షల రూపాయలు వితరణగా అందించారు. ఈ భవనం నిర్మాణ పనులను ఎమ్మెల్యే చిట్టిబాబు ప్రారంభించారు. కార్యక్రమంలో తహసీల్దార్ మృత్యుంజయరావు, సర్పంచ్ పితాని చంద్రకళ తదితరులు పాల్గొన్నారు.
మానేపల్లిలోని శ్మశానవాటికకు దాత రూ. 10 లక్షల సాయం - Cemetery construction at Manepalli
తూర్పుగోదావరి జిల్లా మానేపల్లిలోని శ్మశానవాటికకు ఓ దాత పది లక్షల రూపాయల విరాళం అందించారు. శ్మశానవాటికలో విశ్రాంతి భవనం నిర్మించేందుకు సహాయం చేశారు.
మానేపల్లిలోని శ్మశానవాటిక