ట్రాక్టర్ ఢీకొని దివ్యాంగుడు మృతి - ట్రాక్టర్ ఢీకొని వికలాంగుడు మృతి వార్త
ట్రాక్టర్ ఢీకొని దివ్యాంగుడు మృతి చెందిన ఘటన తూర్పు గోదావరి జిల్లా కొత్తపేట మండలం అవిడిలో జరిగింది. రోడ్డు దాటే క్రమంలో ఈ ప్రమాదం జరిగింది.
![ట్రాక్టర్ ఢీకొని దివ్యాంగుడు మృతి a-disabled-person-was-killed-in-a-tractor-collision-in-kottapeta-zone-of-east-godavari-district](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-10442053-943-10442053-1612027433941.jpg)
ట్రాక్టర్ ఢీకొని వికలాంగుడు మృతి
తూర్పు గోదావరి జిల్లా కొత్తపేట మండలం అవిడిలో ట్రాక్టర్ ఢీకొని దివ్యాంగుడు మృతి చెందాడు. చప్పిడివారిపాలెేనికి చెందిన చప్పిడి గోపీనాథ్ (48) పని నిమిత్తం బయటకు వచ్చాడు. అవిడి డ్యాం సెంటర్ వద్ద రోడ్డు దాటే క్రమంలో.. వేగంగా వస్తున్న ట్రాక్టర్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో అతను సంఘటన స్థలంలోనే మృతిచెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు.. ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు చేపట్టారు. మృతదేహాన్ని కొత్తపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు పోలీసులు పేర్కొన్నారు.