కూలిన భవనం ముందుభాగం ... తప్పిన ప్రమాదం - A collapsed building in P. Gannavaram, East Godavari district
తూర్పుగోదావరి జిల్లా పి.గన్నవరంలో ఓ భవనం ముందుభాగం కూలింది. ఇంట్లోనే ఉన్న రెండు కుటుంబాలు భయంతో ఇంటిని ఖాళీచేసి బయటికి వచ్చేశారు. అయితే ప్రమాదంలో ఎవరికి గాయాలుకాలేదు.
తూర్పు గోదావరి జిల్లా పి. గన్నవరం అమ్మ వీధిలో ఓ ఇంటి ముందుభాగం అమాంతంగా పడిపోయింది. ఆ సమయంలో రెండు కుటుంబాలకు చెందిన వారు ఉన్నారు. ఒక్కసారిగా ముందుభాగం పడిపోవడంతో అప్రమత్తమై బయటికి వచ్చేశారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు భవనం బాగా దెబ్బతిందని వారు తెలిపారు. భవనం లోపల గోడలు, స్లాబ్ బీటలు వారింది. భయంతో రెండు కుటుంబాలు ఖాళీ చేసి సామగ్రితో బయటికి వచ్చేశారు. రెండు రోజుల్లో వివాహం జరగాల్సిన ఇంట్లో ఇలా జరగటం తమను ఆందోళనకు గురిచేసిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఇవీ చదవండి