ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఆర్​బీకే నిర్మాణ పనులు అడ్డుకున్నారని 30 మందిపై కేసు - East Godavari District Alamoor Zone News

తూర్పు గోదావరి జిల్లా ఆలమూరు మండలం మడికి గ్రామంలో రైతు భరోసా కేంద్రం భవన నిర్మాణ పనులను స్థానికులు అడ్డుకున్నారు. అధికారుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు.

ఆర్​బీకే నిర్మాణం పనులు అడ్డుకున్నారని... 30 మంది స్థానికులపై కేసు నమోదు
ఆర్​బీకే నిర్మాణం పనులు అడ్డుకున్నారని... 30 మంది స్థానికులపై కేసు నమోదు

By

Published : Dec 12, 2020, 8:39 AM IST

తూర్పు గోదావరి జిల్లా ఆలమూరు మండలం మడికి గ్రామంలో రైతు భరోసా కేంద్రం నిర్మాణ పనులను స్థానికులు అడ్డుకున్నారు. చిలకలపాడు ఎన్టీఆర్ కాలనీలోని పంచాయతీ స్థలంలో రైతు భరోసా కేంద్రాన్ని నిర్మించేందుకు అధికారులు గత కొన్ని రోజులుగా ప్రతిపాదనలు చేస్తుండడాన్ని వారు వ్యతిరేకిస్తున్నారు. పనులు చేపట్టేందుకు జరిగిన ప్రయత్నాన్ని తప్పుబట్టారు.

ఆ ప్రాంతంలో బహిరంగ మరుగుదొడ్లను గతంలోనే నిర్మించారని... వాటిని కూల్చి ఆర్​బీకే భవనం నిర్మాణం చేయటం ఏంటని స్థానికులు ప్రశ్నించారు. ఈ ఘటనపై పంచాయతీ అధికారులు పోలీసులను ఆశ్రయించారు. పనులకు ఆటంకం కలిగిస్తున్నారని ఆరోపించారు. ఈ మేరకు సుమారు 30 మందిపై పోలీసులు కేసు నమోదు చేసినట్టు ఎస్ఐ శివప్రసాద్ తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details